Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వయంగా స్టింగ్ ఆప‌రేష‌న్‌ నిర్వహించిన హీరోయిన్ దీపిక పదుకొనే .. వెలుగులోకి సంచలన విషయం

  • 24 యాసిడ్ సీసాలను కొనుగోలు చేసిన దీపిక 
  • గుర్తింపు కార్డు అడగకుండానే ఇచ్చేసిన షాపు ఓనర్
  • మండిపడుతూ వీడియో పోస్ట్ చేసిన దీపిక
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే స్వయంగా స్టింగ్ ఆప‌రేష‌న్‌ నిర్వహించింది. ఇందులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో వచ్చిన ఛపాక్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో యాసిడ్ దాడుల నిరోధం కోసం దీపిక పలు కార్యక్రమాల్లో పాల్గొంది. యాసిడ్ సీసాలు అమ్మే విషయంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించిన నేపథ్యంలో వాటిని ఎంతమంది పాటిస్తున్నారన్న విషయంపై దీపిక.. ఛపాక్ సినిమా బృందంలోని కొందరితో కలిసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

దుకాణానికి వెళ్లి వారు యాసిడ్‌  కావాల‌ని అడిగారు. అయితే, యాసిడ్ కొనేవారి గుర్తింపు కార్డు, అడ్ర‌స్ తీసుకోకుండానే షాపు య‌జ‌మానులు యాసిడ్ సీసాలను ఇచ్చారు. మొత్తం 24 యాసిడ్ సీసాలను కొనుగోలు చేసి, మన దేశంలో నిబంధనలను ఎలా గాలికి వదిలేస్తున్నారన్న విషయాన్ని దీపిక గుర్తించింది. త‌న స్టింగ్ ఆప‌రేష‌న్ వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.  సుప్రీంకోర్టు నిబంధ‌నలు పెట్టిన‌ప్పటికీ ఇన్ని సీసాల యాసిడ్‌ను ఈజీగా కొనేశామని తెలిపింది.
Bollywood
Deepika Padukone
New Delhi

More Telugu News